ప్రతి ఒక్కరు ఏదో ఒక బ్లాగ్ పేరును తీసుకుంటారు తప్పా ఎందుకు ఆ బ్లాగు పేరును తీసుకుని ఎందుకు పోస్ట్లు లేకుండా కాళీగా ఉంచుతారో అర్ధం కాదు. నా :: నేటి ప్రపంచం :: బ్లాగు కు డొమైన్ దొరక్క neti-prapancham.blogspot.com వచ్చింది. సర్లే నేటి ప్రపంచం లేకపోతే లేకపాయింది. నేటి లోకం చుద్దామంటే నేటి లోకం వాడెవడో తీసుకున్నాడు. నేటి ప్రపంచం కూడా నేటి లోకం తీసుకున్నవాడే తీసుకున్నాడు. పాపం ప్రజాశక్తి బ్లాగు కు దొరక్క రెండు ఏ లు పెట్టాడు. మంచి డొమైన్ ఎవడో తీసుకుని తెలుగు పేపర్ అని ఒక పోస్ట్ ఆడ్ చేసి కూర్చున్నాడు. వాడికి అది ఏమి ఆనందమో తెలియదు. ఇలా డొమైన్ నేమ్ లో రిజిస్టర్ చేసుకుని ఏం చేసుకుంటారో? అందుకే నాకు అప్పుడప్పుడు తోచిన మంచి పేర్లు రిజిస్టర్ చేసి ఉంచుతాను. ఏ వెధవా తీసుకోకుండా. వాళ్లకి కావాలని నాకు ఈమెయిలు చేసినప్పుడు వాళ్లకి అడ్మిన్ సర్వీస్ ఇస్తాను. వాడు డిలీట్ చేసుకునే అవకాశం లేకుండా !